డ్రైనేజీ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

by Naveena |
డ్రైనేజీ  పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డు సంజీవనగర్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధి ఎజెండాగా డ్రైనేజీల నిర్మాణంతో పాటు..వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని చైర్మన్ పుష్పలత అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సతీష్, జ్యోతి, ఉమాశంకర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు వెంకటస్వామి, నాయకులు కోనేటి నరసింహులు, ఇఫ్తేఖార్, కావలి నరసింహులు, కృష్ణారెడ్డి, ఎర్ర ఆనంద్, పరమటయ్య ,జెకె నరసింహులు, శేఖర్, మురళి, శ్రీకాంత్, సత్యం, శ్రీకాంత్, మోయిన్, రమేష్, ప్రవీణ్, బాలరాజు, ప్రభు, అస్గర్, యాదమ్మ, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed