- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jalgaon: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో హింస.. భారీగా బలగాల మోహరింపు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra) లోని జల్‌గావ్(Jalgaon) జిల్లాలో ఓ మంత్రి కారు డ్రైవర్‌కు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించడంతో పాటు కర్ఫ్యూ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి గులాబ్ రావ్ పాటిల్ (Gulabrao patil) కుటుంబ సభ్యులు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా పాల్తీ గ్రామంలోని కసాయివాడ ప్రాంతంలో డ్రైవర్ హారన్ కొట్టడంతో వాహనం వద్దకు వచ్చిన పలువురు గ్రామస్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మరో వర్గం అక్కడకు చేరుకోవడంతో ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆగ్రహించిన ఓ వర్గం పలు వాహనాలను ధ్వంసం చేసి, దుకాణాలకు నిప్పు పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సుమారు 25 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో గురువారం ఉదయం 6 గంటల వరకు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.