- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరిజిన్ డెయిరీ సీఈఓ ఆదినారాయణ పై దాడి..
by Sumithra |
X
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరిజిన్ డెయిరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణ పై దాడి కలకలం రేపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రామటాకీస్ వీధిలో ఓ బార్బర్ షాప్ వద్ద ఆదివారం రాత్రి ఆదినారాయణ మరో వ్యక్తితో కలిసి ఉన్నాడు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయన పై దాడి చేశారు. ఈ సంఘటనలో ఆదినారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఆదినారాయణ వెంట ఉన్న వ్యక్తి హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఆదినారాయణకు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story