డిసెంబర్ చివరి 5 రోజులు ఫుల్ కిక్..

by Aamani |   ( Updated:2025-01-01 13:49:11.0  )
డిసెంబర్ చివరి 5 రోజులు ఫుల్ కిక్..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : న్యూ ఇయర్ సంబరాలను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలో మద్యం ఏరులై పారింది. సెలెబ్రేషన్స్ పేరిట మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలారు. ఫలితంగా డిసెంబర్ నెల చివరి ఐదు రోజుల్లో రూ.40 కోట్ల 53 లక్షల అమ్మకాలు జరిగాయి. కొత్త సంవత్సరం వేళ జిల్లా వ్యాప్తంగా జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకల్లో మందుబాబులు మద్యం మత్తులో మునిగితేలారు. సాధారణ రోజులతో పోలిస్తే మద్యం అమ్మకాలు రెట్టింపు జరిగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చివరి ఐదు రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకలకు వారాంతం కలిసి రావడంతో మద్యం అమ్మకాల జోరు కొనసాగింది.

గత ఏడాది కంటే రూ. 7 కోట్ల 61 లక్షలు అధికం..

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ చివరి 5 రోజుల్లో సాధారణ రోజులతో పోల్చితే దాదాపు రెట్టింపు మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు రూ.7 కోట్ల 61 లక్షల మద్యం అమ్మకాలు అధికంగా జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం తెలుస్తోంది. 2023 డిసెంబర్ చివరి 5 రోజుల్లో రూ.33 కోట్ల అమ్మకాలు జరగగా, 2024 డిసెంబర్ చివరి 5 రోజుల్లో రూ. 40 కోట్ల 53 లక్షల అమ్మకాలు జరిగాయి.

3 ఏండ్లు గా అదే జోరు..

న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో ఏడు ఏడు మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. 3 ఏండ్లుగా మద్యం అమ్మకాల జోరు కొనసాగుతోంది. 2022 డిసెంబర్ నెలలలో చివరి 5 రోజుల్లో రూ. 23 కోట్ల అమ్మకాలు జరగగా, 2023 డిసెంబర్ చివరి 5 రోజులలో రూ.33 కోట్ల అమ్మకాలు జరగగా, 2024 డిసెంబర్ చివరి 5 రోజుల్లో రూ. 40 కోట్ల 53 లక్షల అమ్మకాలు జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed