- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముత్యంరెడ్డి హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
దిశ,మిరుదొడ్డి : స్వర్గీయ, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి హయాంలోనే దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం మెట్టు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ ముత్యంరెడ్డి విగ్రహాన్ని, ఆయన జయంతి సందర్భంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో గిడ్డంగులు,చెక్ డ్యాంలు,రోడ్డు,రెసిడెన్షియల్ స్కూల్స్,వెల్ఫేర్ స్కూల్స్ వంటివి ఎన్నో నిర్మించారన్నారు.
ప్రస్తుతం నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ,బీజేపీ ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు అన్నారు.ముత్యం రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ముందుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో దుబ్బాక నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని అన్నారు.అంతకుముందు ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, చెరుకు అమర్, వివిధ మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.