- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: కేబినెట్ నిర్ణయాలతో రైతుల కళ్లలో ఆనందం.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: దేశ రైతుల కోసం కేంద్ర కేబినెట్(Central Caboinet) తీసుకున్న నిర్ణయాలు హర్షనీయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. కేబినెట్ నిర్ణయాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. అన్నదాత కళ్లలో ఆనందం నింపడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. అన్నదాతలు పంట పండించడానికి డీఏపీ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేలా, వన్ టైమ్ స్పెషల్ ప్యాకేజీ గడువును పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని అన్నారు. అంతేగాక రైతులకు అండగా నిలిచిన పీఎం ఫసల్ బీమా యోజనతో పాటు పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.