థర్మల్ ప్లాంట్ లో జార్ఖండ్ కార్మికుడి హత్య..

by Sumithra |
థర్మల్ ప్లాంట్ లో జార్ఖండ్ కార్మికుడి హత్య..
X

దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రాంగణంలో బుధవారం వ్యక్తి మృతదేహం వెలుగు చూసింది. మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 11గంటల సమయంలో ప్లాంట్ ప్రహరీ గోడ ప్రక్కన ఓమృత దేహన్ని గుర్తించిన సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.

మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రఘునందన్ రామ్ (42) గా గుర్తించిన పోలీసులు బండరాళ్లతో తలపై మోదీ చంపినట్లుగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ వెంకట గిరి సందర్శించి క్లూస్ టీం తో ఆధారాలు సేకరించగా వాడపల్లి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story