- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు శిక్ష..
దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన పాన్ షాప్ యాజమాని జైలు పాలైన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సిఖ్ విలేజ్ కు చెందిన మహమ్మద్ నవాజ్ (41) సిఖ్ విలేజ్ మెయిన్ రోడ్ ప్రక్కన పాన్ షాప్ ను నడిపిస్తుంటాడు. ఈ క్రమంలో గత కొంత కాలంగా నవాజ్ రాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పాన్ షాప్ ను నడిపిస్తూ, యువకులను, మైనర్ లకు సిగరెట్లు, గుట్కాలు విక్రయాలు చేస్తున్నాడు. అంతే కాకుండా మధ్య రాత్రి దాటిన తర్వాత కూడ పాన్ షాప్ తెరిచే ఉంచుతూ, యువకులకు విక్రయాలు చేస్తున్నాడని, సమాచారం అందుకున్న బోయిన్ పల్లి పోలీసులు ఇటీవల రెండు సార్లు మందలించి ఫైన్ వేశారు.
అయినా సదరు పాన్ షాప్ యాజమాని నవాజ్ లో మార్పు రాలేదు. దీంతో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాన్ లు, గుట్కాలు విక్రయిస్తుండగా పోలీసులు నవాజ్ ను మళ్లీ మందలించారు. ఈ క్రమం లో మహమ్మద్ నవాజ్ పోలీసుల పైన దురుసుగా ప్రవర్తిస్తూ, పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల పైకి దాడికి దిగాడు. దీంతో నవాజ్ ను అదుపులోకి తీసుకున్న బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. దీంతో న్యాయస్థానం నవాజ్ కు మూడు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానను విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో బోయిన్ పల్లి పోలీసులు నవాజ్ ను మంగళవారం రిమాండ్ కు తరలించారు.