- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంలో పలువురి మృతి!
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ లో పలువురు చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. డెక్కన్ మాల్ ను సందర్శించిన ఆయన.. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. మాల్ లో చిక్కుకున్న పలువురు వ్యక్తులు మరణించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 6 గంటల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయని, మంటల తీవ్రతను బట్టి చూస్తే వాళ్లు బతికి ఉండే ఛాన్స్ లేదని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. అయితే మాల్ లో మొత్తం ఎంతమంది చిక్కుకున్నారనేది మాత్రం తెలియరాలేదు. ఉదయం నుంచి ముగ్గురు వ్యక్తులు మాత్రమే మాల్ లో చిక్కుకున్నారని అంతా అనుకున్నారు. కానీ హోంమంత్రి ప్రకటనతో ఇంకా చాలా మందే డెక్కన్ మాల్ లో చిక్కుకుని ఉన్నారని అర్థమవుతోంది. దీంతో మాల్ లో పని చేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక మంటలు ఆర్పడానికి డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు. ఘటనలకు సంబంధించి విచారణ ప్రారంభించామని ఆయన చెప్పారు.