- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కానిస్టేబుల్‌పై దాడి చేసిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పోలీస్ స్టేషన్ చెందిన ఐడి కానిస్టేబుల్ నరేశ్‌పై ఈనెల10న రాత్రి సమయంలో కత్తితో దాడి చేసి పరారైన అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు సీసీ సునీల్ దత్ తెలిపారు. మంగళవారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సత్తుపల్లి మండలం కొత్తూరు సమీపంలో వైకుంఠధామం లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించి పట్టుకుని విచారించారు. ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేందర్‌గా గుర్తించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 90కి కేసులు పైగా ఉండగా, చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ కేసులో నేరస్తుడిగా శిక్ష అనుభవిస్తూ గతేడాది నవంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు.
అప్పటి నుంచి మొత్తం 43కేసుల్లో నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించిన 461గ్రాముల బంగారం, 424గ్రాముల వెండి వస్తువులు, రూ.3.33లక్షల నగదు, రెండు, బైకులు, సెల్, దొంగతనానికి ఉపయోగించే పలు రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి, సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై కవిత, పలువురు కానిస్టేబుళ్లకు రివార్డులు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కల్లూరు ఏసీపి ఏ రఘు ,పట్టణ సీఐ టీ కిరణ్, రూరల్ సీఐ ముత్తు లింగయ్య, ఎస్సై రఘు, కల్లూరు, వేంసూరు, వీఎం బంజర్ ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.