భారీ అగ్ని ప్రమాదం.. 500 బట్టల దుకాణాల్లో చెలరేగిన మంటలు

by Anjali |   ( Updated:2023-03-31 06:13:04.0  )
భారీ అగ్ని ప్రమాదం.. 500 బట్టల దుకాణాల్లో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: సుమారు 500 బట్టల దుకాణాల్లో అగ్ని ప్రమాదం నెలకొన్న ఘోరమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ కాన్పూర్‌లోని బాస్మండి ప్రాంతంలో శుక్రవారం(ఈ రోజు) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎఆర్ టవర్ వద్ద మంటలు చెలరేగడంతో పండుగల సమయంలో విక్రయించేందుకు సిద్దంగా ఉంచిన 500 బట్టల షాపులు ఈ ప్రమాదంలో దగ్దమయ్యాయి. అలాగే పక్కనే ఉన్న కాంప్లెక్స్‌లకు, మసూద్ టవర్ -1, మసూద్ టవర్ 2, హమ్రాజ్ కాంప్లెక్స్‌లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మంటలను ఆర్పించేందుకు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. సుమారు 25 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటని ఇంకా తెలియరాలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed