- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోరుగా ఇసుక రవాణా.. 9 ట్రాక్టర్ల పట్టివేత
దిశ,బీర్కూర్/ బాన్సువాడ: బాన్సువాడలోని సోమేశ్వర్ చౌరస్తా వద్ద అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 9 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణా బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ మంజీరా నుంచి గత నాలుగు రోజులుగా వే బిల్లులు లేకుండా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. వే బిల్లులు లేకుండా ఇసుకను రవాణా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతుంది. ఇంత తంతు నడుస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కిష్టాపూర్ మంజీరా నుంచి ప్రతిరోజు వందలాది ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణాచేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పెద్దమనుషుల కనుసైగల్లో నడుస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. పట్టుకున్న 9 ట్రాక్టర్లను పోలీసులు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వదిలేస్తారో, కేసులు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి.
Also Read...