శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

by Vinod kumar |
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
X

దిశ, శంషాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ప‌ట్టుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం షార్జా నుండి (6E-1406) ఇండిగో విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. బంగారం ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించారు. బంగారాన్ని ప్రయాణికుడు ఎలక్ట్రానిక్ పరికరాలలో దాచిపెట్టి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రయాణికుని వద్ద నుండి 23 లక్షల 14 వేల విలువచేసే 435.760 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story