మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

by Shiva |   ( Updated:2023-06-07 16:11:23.0  )
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
X

దిశ, నవీపేట్ : పక్కింటి వారు దొంగతనం నేపం వేయడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని శివతాండ గ్రామ పంచాయతీలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్ లక్ష్మికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందులో మూడో కుమార్తెను హైదరాబాద్ లో ఉంటున్న తన భర్త ఇంటికి వదిలేందుకు మంగళవారం తీసుకెళ్లింది.

ఈ క్రమంలోనే ఇంటి వద్ద తన చిన్న కుమార్తె వందన (16) తన తల్లికి ఫోన్ చేస్తానంటూ తమ పక్కింట్లోని భానోత్ ప్రవీణ్ తీసుకుని మాట్లాడి తిరిగి ఇచ్చేసింది. ఆ ఫోన్ పౌచ్ లో ఉన్న రూ.600 వందన దొంగిలించిందని వందనపై ప్రవీణ్, అతని తల్లి బులిభాయ్ దొంగతనాన్ని ఆపాదించి, బూతులు తిట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వందన ఇంట్లో ఫ్యాన్ ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story