పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో నలుగురు సజీవ దహనం

by Satheesh |   ( Updated:2022-12-26 16:07:31.0  )
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో నలుగురు సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లిలోని పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారస్ యూనిట్‌ 3లో షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ఎత్తును మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మంటల్లో సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకు వస్తున్నారు. కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులను బి. రాంబాబు, రాజేష్ బాబు, రామకృష్ణ, మజ్జి వెంకటరావు, సతీష్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed