అవినీతికి పాల్పడిన మహిళా ఇన్ స్పెక్టర్.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

by Sathputhe Rajesh |
అవినీతికి పాల్పడిన మహిళా ఇన్ స్పెక్టర్.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ఇన్‌స్పెక్టర్ అవినీతి బాగోతం సంచలనంగా మారింది. ఈ ఘటన తమళ నాడు‌లోని చెన్నైలో వెలుగు చూసింది. చెన్నైకి చెందిన మహిళా ఇన్స్ పెక్టర్ రాణి రోడ్డు ప్రమాదాల సమయంలో లంచాలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసు శాఖ విచారణ చేపట్టింది. విచారణలో అవినీతి చేసినట్లు తేలడంతో ఇన్స్ పెక్టర్ రాణిని సస్పెండ్ చేస్తూ తమిళనాడు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story