- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు చిన్నారులు, మహిళ మృతి..
దిశ, అబ్దుల్లాపూర్ మెట్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షహీజది బేగం (35) అనే మహిళా స్థానిక ఫాంహౌస్ లో సూపర్వైజర్ గా పని చేస్తూ, బలిజగూడలో నివాసం ఉంటుంది. బంధువుల కుమారుడు ఎండీ సమీర్ (9), మరో బంధువుల కూతురు ఫాతిమా(5) లతో కలిసి ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు తన కారులో పెద్ద అంబర్ పేట లోని బేకరి కి వెళ్ళారు.
తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో ఏఏల్ నగర్ కమాన్ వద్దకు రాగానే కారుకు ఎదురుగా లారీ డ్రైవర్ జమీరాం కిషన్ అతి వేగంగా, అజాగ్రత్తతో వచ్చి కారును ఎదురుగా డీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఎగిరి రోడ్డు మీద కిందపడి పోయారు. దీంతో తీవ్ర గాయాలతో షహీజది బేగం, Md. సమీర్ అక్కడికక్కడే మరణించారు. ఫాతిమాను చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.