నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం

by Mahesh |
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం
X

దిశ, నాగర్ కర్నూల్: దైవదర్శనానికి ఆటోలో వెళ్తున్న కుటుంబాన్ని ఆర్టీసీ బస్సు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అనంతసాగర్ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితులంతా వికారాబాద్ జిల్లా యాలాల మండలం గుంటుపల్లి గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకెళ్తే వికారాబాద్ జిల్లా యాలాల మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన భీమప్ప కుటుంబం శ్రీశైలం దైవదర్శనానికి తమ కుటుంబ సభ్యులు 8 మందితో కలిసి ఆటోలో తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరారు. నాగర్ కర్నూలు జిల్లా అనంతసాగర్ గేట్ సమీపాన అచ్చంపేట నుంచి నాగర్ కర్నూల్ వైపు వస్తున్న ఆర్టీసీ డిపో బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ రామకృష్ణ (30) అక్కడికక్కడే మృతి చెందగా భీమప్ప అత్త మణెమ్మ (55) కూడా అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Next Story