చేసిన అప్పులు తీరక రైతు ఆత్మహత్య

by Sridhar Babu |
చేసిన అప్పులు తీరక రైతు ఆత్మహత్య
X

దిశ,తిరుమలాయపాలెం : తెచ్చిన అప్పులు తీరవనే ఆవేదనతో ఓ యువ రైతు గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన ఆదివారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లక్ష్మీదేవిపల్లి తండాకు చెందిన మూడు నాగేశ్వరరావు (33) అనే రైతు తనకున్న కొంత భూమితోపాటు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటమొత్తం దెబ్బతిన్నది.

దీనికి తోడు నాగేశ్వరరావు అప్పు చేసి అశోక్ ల్యాలాండ్ వ్యాన్ కొనుగోలు చేశాడు. దీంతో భార్య కవిత, నాగేశ్వరరావు మధ్యలో కొంత కాలంగా గొడవలు జరుగుతుంది. గొడవల కారణంగా నాగేశ్వరరావు ఈనెల 19వ తేదీన గడ్డి మందు తాగడంతో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగేశ్వరరావు ఆదివారం మరణించాడు. మృతుడికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై జగదీశ్ తెలిపారు.

Advertisement

Next Story