- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పత్తి వ్యాపారులు బైండోవర్
దిశ,తల్లాడ : వివిధ గ్రామాల్లో ఆటోలతో లైసెన్స్ లేకుండా రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తున్న తల్లాడ మండలం బాలపేట, అన్నారుగూడెం గ్రామాలకు చెందిన 12 మంది వ్యాపారులను గురువారం తహసీల్దార్ వనజ ఎదుట తల్లాడ పోలీసులు బైండోవర్ చేశారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా విధించారు. తల్లాడ మండలానికి చెందిన పత్తి వ్యాపారస్తులు కొంతమంది జిల్లాలోని వివిధ గ్రామాల్లో ట్రాలీ ఆటోలతో రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తూ తూకంలో తేడా చేస్తూ మోసం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఎర్రుపాలెం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పత్తి కొనుగోలు చేసే క్రమంలో తూకంలో తేడా చేయడంతో రైతులు పట్టుకొని వారిని చితకబాదిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో స్పందించిన తల్లాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేశారు. ఆ సమయంలో ఆటోలు, మినీ వ్యాన్ లను నిలిపి స్టేషన్ కు తరలించారు. వారి వద్ద ఉన్న సామాగ్రిని స్వాధీనం చేసుకొని 12 మంది పత్తి వ్యాపారులను ముందస్తు చర్యల కింద బైండోవర్ చేసినట్లు ఎస్ఐ బి.కొండలరావు తెలిపారు.