అమ్మాయిలు నగ్నంగా కనిపించే కూలింగ్ గ్లాస్.. పెట్టుకుందాం అని కొన్నారో ఇక అంతే..?

by sudharani |
అమ్మాయిలు నగ్నంగా కనిపించే కూలింగ్ గ్లాస్.. పెట్టుకుందాం అని కొన్నారో ఇక అంతే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి కాలంలో చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అనేక తప్పులు చేస్తున్నారు. ఎంత మందిని మోసం చేసి లక్షల్లో డబ్బులు కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ల ఆలోచనలను మంచి విషయాలకు ఉపయోగించకుండా.. టెక్నాలజీని ఉపయోగించుకుని అక్రమంగా డబ్బు కూడబెట్టుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన ముఠానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగుళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైర్, చిత్తు, ఈర్షాద్ అనే వ్యక్తులు చెన్నైలోని కోయంబేడులో నివాసం ఉంటున్నారు. అయితే ఈ నలుగురు ఈజీగా సంపాదించేందుకు పన్నాగం పన్నారు. సమ్మర్‌ను ఆసరాగా తీసుకుని కూలింగ్ గ్లాసెస్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే వాటిని అమ్మేవారికి మాత్రం ఈ కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే మీరు ఎవరిని చూసిన వారు నగ్నంగా కనిపిస్తారని తెలిపారు. ముఖ్యంగా మీకు నచ్చిన అమ్మాయిలను న్యూడ్‌గా చూడవచ్చని నమ్మిస్తారు. డబ్బున్న వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుని వారికి ఈ కూలింగ్ గ్లాస్‌లను సేల్ చేసి లక్షల్లో డబ్బు సంపాదించుకున్నారు.

అయితే ఒక్కో కూలింగ్ గ్లాస్‌ ధర లక్షల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు కోయంబేడులో ఈ మాయగాళ్లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి రైస్ ఫులింగ్ చేసే సామాగ్రి, గన్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

Next Story