గన్​తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

by Sridhar Babu |   ( Updated:2024-10-13 14:46:11.0  )
గన్​తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆదివారం తన గన్​తో ఆత్మహత్య చేసు కున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గుడిబైన శ్రీనివాస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని గోపాల్ నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. మృతునికి ఒక కొడుకు సుశాంక్, భార్య వరలక్ష్మి ఉన్నారు. కుటుంబ కలహాలతోనే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని డీఎస్పీ స్పష్టం చేశారు.


👉 Also Read: తనను బలి పశువు చేశారంటూ...సూసైడ్ వీడియో విడుదల చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య

Advertisement

Next Story