Crime News : నీటి సంపులో పడి చిన్నారి మృతి...

by Sumithra |   ( Updated:2024-10-27 07:46:54.0  )
Crime News : నీటి సంపులో పడి చిన్నారి మృతి...
X

దిశ, భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గడిపె అస్మిక (4) అనే చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందింది. సంపత్, స్వర్ణలకు ముగ్గురు పిల్లలు కాగా అస్మిక చిన్న కూతురు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ జీవిస్తుంటారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంటివద్ద ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడింది. స్థానికులు గమనించి 108 కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వచ్చేలోపే చిన్నారి మృతి చెందింది.

Advertisement

Next Story