షార్ట్ సర్క్యూట్ తో గడ్డివాములు దగ్ధం..

by Sumithra |
షార్ట్ సర్క్యూట్ తో గడ్డివాములు దగ్ధం..
X

దిశ, మాడుగులపల్లి : షార్ట్ సర్క్యూట్ తో గడ్డివాములు దగ్ధమైన సంఘటన మండలంలోని చెరువుపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కట్టా జాన్ రెడ్డి, పోలేబోయిన సైదులుకు చెందిన గడ్డివాములు షార్ట్ సర్క్యూట్ వలన మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి ప్రమాదం జరగకుండా చూశారు. పశువుల మేతకోసం ఏర్పాటు చేసిన గడ్డివాములు దగ్ధం కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story