- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Double Murder: గ్రామం నడివీధిలో జంట హత్యల కలకలం
దిశ, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లాలో జంట దారుణ హత్యలు కలకలం సృష్టించాయి. బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారుడిని గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి ఇద్దరిని నడీరోడ్డుపైనే దారుణంగా మర్డర్ చేసి వెళ్లిపోయాడు. గ్రామం మధ్యలో ఇంతటి ఘోరంగా ప్రాణాలు తీస్తున్నా ఏ ఒక్కరూ అడ్డుకోకలేకపోయారు. గుమ్మడిదల మండలంలో గురువారం ఉదయం జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి.
గుమ్మడిదల మండలం, బొంతపల్లి గ్రామ పరిధిలోని వీరభద్ర నగర్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ఫ్యామిలీలు వలస వచ్చి స్థిరపడ్డాయి. కాగా, యూపీకి చెందిన సరోజదేవి (50), ఆమె కుమారుడు అనిల్ (30) ఈ రోజు ఉదయం ఉద్యోగ బాధ్యతల నిమిత్తం బైక్‌పై వెళ్తున్నారు. ఇదే సమయంలో మరో వ్యక్తి కారులో వచ్చి వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను అడ్డగించి తల్లీకుమారుడిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి, దాడి చేశాడు. ఈ ఘటనలో సరోజదేవి, అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
అయితే హత్యకు పాతకక్షలే కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. యూపీకి చెందిన మరో కుటుంబానికి, సరోజదేవి ఫ్యామిలీకి గత ఆరు నెలలుగా రెండేళ్ల బాబు మృతి విషయంలో వివాదం నడుస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఒకే కుటుంబానికి ఇద్దరు హత్యకు గురైనట్టు అభిప్రాయపడుతున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుధీర్ కుమార్, ఎస్ఐ మహేశ్వరరెడ్డి ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరిస్తున్నారు. హత్య చేసినట్టు భావిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ జంట హత్యలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.