రోడ్డు ప్రమాదంలో బీజేపీ యువనేత దుర్మరణం

by GSrikanth |   ( Updated:2022-10-10 04:09:49.0  )
రోడ్డు ప్రమాదంలో బీజేపీ యువనేత దుర్మరణం
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ యువనేత మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల పట్టణానికి చెందిన బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ స్నేహితులతో కలిసి బొక్కలగుట్ట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా సోమవారం తెల్లవారుజామున క్వారీ రోడ్ నుండి బొక్కలగుట్ట మధ్యలో తిమ్మాపూర్ వద్ద కారు పల్టీ కొట్టి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story