వైశాలి, నవీన్ రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్

by samatah |
వైశాలి, నవీన్ రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నవీన్ రెడ్డి, వైశాలి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నవీన్ రెడ్డి తమ అదుపులో లేరని, 31 మందిని అరెస్ట్ చేశామని ప్రకటించారు. అలాగే నిందితుల్లో సగం మంది టీషాప్ వర్కర్స్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఇక గత కొన్నిగంటల క్రితమే పోలీసులు నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, ఆయనతోపాటు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితులైన 15 మందిని అరెస్ట్ చేశామని తెలిపిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇంకా చాలా మంది నేరస్తులున్నారు వారందరినీ అదుపులోకి తీసుకుంటాం, ఈ కేసుపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. గంటల వ్యవధిలోనే పోలీసులు మాట మార్చడంతో, పలు అనుమానాలు తలెత్తుతున్నాయని వైశాలి తల్లిదండ్రులు అంటున్నారు

Advertisement

Next Story