Bandra Railway Station: ముంబై మహా నగరంలో తీవ్ర విషాదం.. బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట

by Shiva |
Bandra Railway Station: ముంబై మహా నగరంలో తీవ్ర విషాదం.. బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై (Mumbai) మహా నగరంలో ఇవాళ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాంద్రా (Bandra)లోని టెర్మినస్ రైల్వే స్టేషన్‌ (Terminus Railway Station)లో ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీపావళి పండుగ నేపథ్యంలో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి బాంద్రా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ (Bandra - Gorakhpur)ji స్పెషల్ ట్రైన్ వెళ్తోంది. అయితే, పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అదే ఫ్లాట్‌ఫామ్‌‌పైకి భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, అక్కడున్న పోలీసులు వారిని అదుపు చేయలేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జరిగిన ఘటనపై సీఎం ఏక్‌నాథ్ షిండే (CM Eknath Shinde) ఆరా తీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story