- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. మాతృ దినోత్సవం రోజే తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి.. విషం తాగి తాను ఆత్మహత్యాయత్నం..
దిశ, మీర్ పేట్: అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను మాతృ దినోత్సవం రోజే తల్లి నీటి టబ్ లో ముంచి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేనావత్ భారతి, శ్రీనివాస్ భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. లలిత నగర్ జిల్లెలగూడలో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం శ్రీనివాస్ తల్లి ఊరి నుంచి రావడంతో భార్య భర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. గొడవ పెద్దదిగా మారడంతో భర్త ఇంట్లో లేని సమయంలో భారతి తన పెద్ద కుమారుడు (18 )నెలలు, చిన్న కుమారుడు (8 ) నెలలు ఇద్దరినీ నీటి టబ్ లో ముంచి హత్య చేసింది.
ఆ తరువాత తాను విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే క్రమంలో తన భర్త శ్రీనివాస్ కి ఫోన్ ద్వారా ఇద్దరు పిల్లలను చంపానని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్తకు తెలిపింది. భర్త హుటాహుటిన ఇంటికి చేరుకొని ఇద్దరి పిల్లలను కొత్తపేట పారమిత చిల్డ్రన్ హాస్పిటల్ తరలించారు. అప్పటికే చిన్నారులు మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు. తల్లి భారతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారుల మృతదేహాలను ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై బద్యా నాయక్ హాస్పిటల్ కి వెళ్లి సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.