ఈ SI మామూలోడు కాదు.. అంతకు మించి..!

by Nagaya |   ( Updated:2023-04-07 13:17:25.0  )
ఈ SI మామూలోడు కాదు.. అంతకు మించి..!
X

దిశ, ఉత్తరాంధ్ర : అనకాపల్లి జిల్లాలో ఎస్సై నిర్వాకం వేటుపడేలా చేసింది. పోలీసులని అహంకారం కింద పడేటట్టు చేసింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఈయనపై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎస్సై దివాకర్‌పై నిగా పెట్టిన ఉన్నతాధికారులు సమయం కోసం వేచి చూశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో విద్యార్థులు జై జనసేన అంటూ నినాదాలు చేశారు. దాంతో విద్యార్థులపై రెచ్చిపోయి ఇష్టానుసారంగా దాడికి దిగాడు. దాడి వీరభద్రరావు కళాశాల లోపలికి చొరబడి విద్యార్థులపై చేయి చేసుకున్నాడు. ప్రధానాంశంగా ఎస్ఐపై దీనిపైనే ఫిర్యాదు చేసిన అనేక ఆరోపణ నేపథ్యంలో వేటు వేశారు అధికారులు.

అధికారులు వార్నింగ్ ఇచ్చిన మారని తీరు


2009 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐ దివాకర్ యాదవ్ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో భూకబ్జాదారులకు సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు పంపించగా అక్కడ తీరు మారలేదు. ఏసీబీలో కూడా ఆయన బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారని ఆరోపణలతో మరోసారి అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఒక డీఎస్పీ సహకారంతో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్‌ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వీటన్నిటినీ తప్పించుకున్నా విద్యార్థులపై చేయి చేసుకోవడంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను విడిచిపెట్టలేదు. పోలీస్ శాఖ అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని బాధ్యతాయుతంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అధికారులు వేటు వేయక తప్పలేదు.

ఇవి కూడా చదవండి: Tirupati: సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుల అరెస్ట్

Advertisement

Next Story