lightning : పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి

by Sridhar Babu |
lightning : పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి
X

దిశ,చెన్నారావుపేట : పిడుగు ( lightning)పడడంతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని కాల్ నాయక్ తండా గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. తండావాసుల కథనం ప్రకారం... ఇదే తండాకు చెందిన కొర్ర నాగరాజు (30) (Korra Nagaraju)కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే అదే తండాకు చెందిన బానోతు నరసింహ అనే రైతుకు పత్తి వేరడానికి కూలి పనులకు వెళ్లాడు. బుధవారం మధ్యాహ్నం వేళలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఒక్కసారిగా పడింది.

దీంతో ఉరుముల శబ్దం రావడంతో తనతో వెళ్లిన 20 మంది కూలీలు ఇళ్లకు రావడానికి పరుగులు పెట్టారు. వెనకాల నాగరాజు వస్తుండగా ప్రమాదవశాత్తు అతనిపై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన తల్లి శాంతి ఎడమ చేతికి గాయాలయ్యాయి. మృతుడికి భార్య విజయ, మూడు సంవత్సరాల బాబు, 20 రోజుల క్రితమే పుట్టిన మరో బాబు ఉన్నారు. పిడుగు పడి భర్త నాగరాజు మృతి చెందడంతో భార్య, కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిచ్చింది. అలాగే కాల్ నాయక్ తండా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story