- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటికి కూతవేటు దూరంలో యాక్సిడెంట్…వ్యక్తి మృతి
by Kalyani |
X
దిశ, యాచారం : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కల్లపల్లి తండాకు చెందిన ఆంగోత్ హరి నాయక్ (44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యాచారం మండల కేంద్రానికి ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో తక్కల్లపల్లి తండా వద్ద తన ఇంటికి కూతవేటు దూరంలో రోడ్డు దాటుతుండగా దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా ఎదురుగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానికులు ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story