తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య

by Shiva |
తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య
X

దిశ, వెల్దుర్తి : పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నావంటూ తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి లక్ష్మణ్ కుమారుడు సాయి కుమార్ (23) గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఏదైనా పని చేయాలంటూ మందలించడంతో గ్రామ శివారులో గల బంగారమ్మ ఆలయం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కామారెడ్డి రైల్వే రైల్వే ఎస్సై తావునాయక్ మంగళవారం ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story