గంజాయి సాగు చేస్తున్న యువకుడి అరెస్ట్..

by Sumithra |
గంజాయి సాగు చేస్తున్న యువకుడి అరెస్ట్..
X

దిశ, మేడ్చల్ టౌన్ : గంజాయి మొక్కలను సాగు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మేడ్చల్ మండలంలోని రావల్పూర్ గ్రామంలోని సుజిత గూడ్స్ కాలనీకి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. 180 గ్రాముల రెండు గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి అదే గ్రామానికి చెందిన కాంకోన్ జర్దార్ అలియాస్ రాహుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Next Story