ఉద్యోగం వచ్చిందని సంతోషించాడు.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు

by sudharani |
ఉద్యోగం వచ్చిందని సంతోషించాడు.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులో కూడా గుండె పోటుతో మృత్యుఒడికి చేరుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. సరదాగా ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళ్లిన యువకుడు థియోటర్‌లోనే గుండెపోటుతో మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లా నక్కలగరుబు గ్రామం మధిర మండలానికి చెందిన కొట్టె పెద్దకృష్ణ, రాధ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు మురళీ కృష్ణ (26) బీటెక్ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలనే కోరికతో దానికి సంబంధించి కోర్స్ కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో తాజాగా ఉద్యోగం సంపాదించాడు. ఈ నెల 17న ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అయితే ఉద్యోగంలో చేరే ముందు ఇంటికి వెళ్లాడు. తనకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషంగా ఇంట్లో వాళ్లకు చెప్పుకున్నాడు. మన కష్టాలు తీరిపోయాయంటూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు.

అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రమాణం అయ్యాడు. ఈ క్రమంలో సరదాగా స్నేహితులతో సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మురళీ కృష్ణ మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఉద్యోగం వచ్చింది మన కష్టాలు తీరిపోయాని చెప్పిన కన్నబిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు అక్కడ ఉన్నవారిని కలిచివేసింది.

Advertisement

Next Story

Most Viewed