అమెరికాలో బద్దలైన అతి పురాతన అగ్నిపర్వతం.. భారీగా ఎగసిపడుతున్న లావా(వీడియో)

by Jakkula Mamatha |   ( Updated:2024-12-24 05:15:21.0  )
అమెరికాలో బద్దలైన అతి పురాతన అగ్నిపర్వతం.. భారీగా ఎగసిపడుతున్న లావా(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికాలో అతి పురాతనమైన, చురుకైన అగ్నిపర్వతం(Volcano) బద్దలైంది. వివరాల్లోకి వెళితే.. హవాయి బిగ్ ఐలాండ్‌లోని అతి పురాతనమైన కిలోవెయా అగ్నిపర్వతం వేకువ జామున 2 గంటల సమయంలో భారీ విస్ఫోటనం చెందినట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం నుంచి అధికంగా లావా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈ విస్ఫోటన పగుళ్ల నుంచి సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని అది వాతావరణంలోని ఇతర వాయువులతో కలిసి ప్రతి స్పందించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదకర వాయువులు స్థానికులు, జంతువులు, పంటలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 1983 నుంచి కిలోవెయా అగ్నిపర్వతం(Kilowaya Volcano) క్రియాశీలంగా ఉందని అప్పుడప్పుడు ఇందులో స్పల్ప స్థాయిలో విస్ఫోటనాలు సంభవిస్తుంటాయన్నారు. అయితే ఈ వరుసలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని పర్వతమే మైనా లోవా కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. భారీ విస్ఫోటనం(huge explosion) చెందిన అగ్నిపర్వతం నుంచి 80 మీటర్ల (260 అడుగుల) ఎత్తు వరకు లావా ఎగసిపడుతున్న వీడియోలను అమెరికా వోల్కనాలజిస్టులు విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed