వివాహేతర సంబంధం.. అడ్డొస్తోందని రెండేళ్ల చిన్నారి దారుణ హత్య

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-20 06:12:33.0  )
వివాహేతర సంబంధం.. అడ్డొస్తోందని రెండేళ్ల చిన్నారి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని రెండేళ్ల చిన్నారిని విచక్షణా రహితంగా కొట్టి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నతో కనగల్ మండలంలోని లచ్చుగూడేనికి చెందిన రమ్యకు 2015లో వివాహమైంది. వీరికి ఐదేళ్ల శివరాం, రెండేళ్ల కుమార్తె ప్రియాన్షిక(2) ఉన్నారు. వెంకన్న ఈ ఏడాది కరోనాతో మృతి చెందారు. కొన్నాళ్ల తర్వాత రమ్యకు అదే గ్రామానికి చెందిన వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.


రమ్య కొన్ని రోజులు అత్త మామ వద్ద ఉండి తర్వాత అద్దె ఇంట్లో ఉంటుంది. తమ వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డొస్తోందని భావించిన ఇద్దరు చిన్నారిని చెంపపై గట్టిగా కొట్టారు. గోడకేసి విసిరికొట్టారు. అంతటితో ఆగక ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. చిన్నారి మూర్ఛతో చనిపోయిందని కట్టుకథ అల్లారు. పాప ముఖంపై దెబ్బలను చూసిన రమ్య మామ యాదగిరి కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులను నిందితులను అదుపులోకి తమదైన శైలిలో విచారణ జరపగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి : విజయవాడలో దారుణం.. మహిళను బంధించి మూడు రోజుల పాటు గ్యాంగ్ రేప్

Advertisement

Next Story

Most Viewed