- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలమూరు జిల్లా విద్యార్థి దుర్మరణం
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అమెరికాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కపెట్ట గ్రామానికి చెందిన బోయ మహేష్ (25) అనే యువకుడు దుర్మరణం చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందింది. బోయ వెంకట రాములు, శకుంతల దంపతుల ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడు అయిన మహేష్ అమెరికాలో ఎమ్మెస్ (ఇంజనీరింగ్) చదవడానికి గత డిసెంబర్‌లో వెళ్ళాడు. అక్కడ కన్ కోల్డియా యూనివర్సిటీ లో చేరి తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు.
మంగళవారం రాత్రి కారులో తన మరో ముగ్గురు మిత్రులతో కలిసి పుట్టినరోజు ఫంక్షన్‌కు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతావారు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. విషయం తెలియగానే కప్పట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు యత్నాలు జరుగుతున్నాయి.