- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడి ప్రాణం తీసిన ఫోన్.. ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఏమైందంటే?
దిశ, వెబ్‌డెస్క్: మనలో చాలామంది ఫోన్‌లకు చార్జింగ్ పెట్టి గేమ్ ఆడటం, చాటింగ్ చేయడం, మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. అది ప్రమాదమని తెలిసినా స్మార్ట్ ఫోన్ మోజులో పడి పట్టించుకోరు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫోన్‌కు చార్జింగ్ పెట్టి.. ఫోన్ మాట్లాడుతుండగా కరెంట్ షాక్ కొట్టి యువకుడు మరణించాడు.
జిల్లాలోని సీతారామపురం మండలం ముత్తోలినగర్‌కు చెందిన సాల్మన్, సులోచనల కుమారుడు ప్రవీణ్ కుమార్(29) మంగళవారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో ఫోన్ కి చార్జింగ్ పెట్టి మాట్లాడాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులు రావడంతో ఒక్కసారిగా ఫోన్ నుంచి కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్న ప్రవీణ్‌ను హుటాహుటిన సీతారామపురం ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు ప్రవీణ్ అప్పటికే చనిపోయినట్టు నిర్థారించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆటోలు, ఇతర వాహనాలు రాకపోవడంతో.. బైక్‌పైనే తీసుకెళ్లారు.
గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ అలా చేసిన యువకుడు.. కట్ చేస్తే..?