ఆరేళ్ల బాలుడిపై మైనర్ లైంగిక దాడి..

by Hamsa |   ( Updated:2023-01-17 12:03:26.0  )
ఆరేళ్ల బాలుడిపై మైనర్ లైంగిక దాడి..
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల సమాజం మరీ దారుణంగా తయారైంది. మహిళలపైనే కాదు అబ్బాయిలపై కూడా నీచంగా కొంత మంది లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు వార్తల్లో చూస్తునే ఉన్నాం. తాజాగా, 6 ఏళ్ల బాలుడిపై పొరుగింటి 13 ఏళ్ల మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలో గురుగ్రామ్ బాద్‌షాపూర్ ప్రాంతంలో ఆరేళ్ల బాలుడు 1వ తరగతి చదువుతూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అయితే బాలుడి పొరుగింట్లో ఉండే 13 ఏళ్ల మైనర్ బాలుడు జనవరి 15న అతడిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలుడు ఆదివారం తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో బాదితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోక్సో చట్టం, సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి సిటీ కోర్టులో సోమవారం హాజరుపరిచారు. చట్టప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి : ఘోరం.. కన్న కూతురిపై కసాయి తండ్రి అత్యాచారం

Advertisement

Next Story