- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పుణె- నాసిక్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మహిళలు స్పాట్ డెడ్
by Satheesh |

X
దిశ, వెబ్‌డెస్క్: పుణె- నాసిక్ ఎక్స్ ప్రెస్ హైవేపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఓ కారు మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరి కొందరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story