ఊపందుకున్న టపాసుల విక్రయాలు..

by Shyam |
ఊపందుకున్న టపాసుల విక్రయాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ మరికొన్ని గంటలే మిగిలుందన్న సమయంలో ఎట్టకేలకు టపాసుల విక్రయాలు ఊపందుకున్నాయి. ఇప్పుడిప్పుడే బాణాసంచా విక్రయ స్టాళ్లు వినియోగదారులతో నిండు తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో చొప్పున టాపాసులు విక్రయిస్తుండగా, కిలో రూ. 400 నుంచి 600మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో కస్టమర్లు కూడా పర్యావరణహితమైన మతాబులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, గ్రీన్ క్రాకర్స్‌కు మార్కెట్లో అధిక ధరలు ఉన్నాయని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి 8 నుంచి 10గంటల మధ్యలో మాత్రమే టాపాసులు పేల్చాలని రాష్ట్రప్రభుత్వం విధించిన ఆంక్షలతో పాటు, అధిక ధరల వలన కస్టమర్లు కూడా అందుబాటు ధరలో చిన్న ఐటమ్స్‌కు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఏదైమైనా ఆశించినంత మేర బాణాసంచా బిజినెస్ జరగకపోవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా చేస్తున్నాయి. కాగా, టపాసులు కాల్చే సమయంలో శానిటైజర్ మాత్రం వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. నిప్పురవ్వలు పడితే చర్మం కాలిపోయే పరిస్థితి ఏర్పడవచ్చునని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed