- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎందుకు ఆలస్యం చేస్తున్నారో.. అర్ధం కావడం లేదు
దిశ, సూర్యాపేట: నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ ఆయుకట్టు కింద, ఎత్తు పోతల కింద ఉన్న రైతులు వర్షాలకు వరి నార్లు పోసి 30 రోజులు అవుతుందన్నారు. నీరు లేక పోసిన నార్లు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బోర్లు, బావులు ఉన్న రైతులు ముందునాట్లు పెట్టుకోవడం మూలంగా ఆధారం లేని రైతులు, పొలాలకు దారి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌లో ప్రస్తుతం నీటి మట్టం 551 అడుగులో నీరు ఉన్నందున అధికారులు వెంటనే జోక్యం చేసుకుని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.
గత సంవత్సరం 510 అడుగులు ఉన్నప్పుడే నీటిని విడుదల చేశారని, నేడు 551 అడుగులు నీరు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, పోసిన వరి నార్లు ముదిరి పోయే అవకాశం ఉందని, నార్లు ముదిరిపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం, ప్రాజెక్టు అధికారులు తక్షణమే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.