పీఎం కేర్స్ ప్రైవేట్ సంస్థనా?: సీపీఎం నేత శ్రీనివాస్

by Shyam |
పీఎం కేర్స్ ప్రైవేట్ సంస్థనా?: సీపీఎం నేత శ్రీనివాస్
X

దిశ, న్యూస్‌బ్యూరో: పీఎం‌ కేర్స్ నిధుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని సీపీఐ (ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీఎం కేర్స్‌ ఆర్‌టీ‌ఐ చట్టం సెక్షన్ 2 (హెచ్) కింద పబ్లిక్ అథారటీ కాదనడంతో, అది ఎమైనా ప్రైవేట్ సంస్థనా అని ప్రశ్నించారు. వెబ్ సైట్‌లో విరాళాలు చెల్లించడానికి అవసరమైన సమాచారమే తప్ప ఎన్ని నిధులు అందాయనే వివరాలేమీ లేవని తెలిపారు. పీఎం కేర్స్‌కు ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు వేల కోట్ల నిధులు అందించాయని పేర్కొన్నారు. ఈ నిధులన్ని పబ్లిక్ అథారటీ కింద కాకుండా ప్రైవేట్ సంస్థగా ఎలా పరిగణిస్తారాని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed