ఓయూ భూములను రక్షించండి

by Shyam |
ఓయూ భూములను రక్షించండి
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేష్‌రెడ్డిల బృందం గవర్నర్ తమిళిసైకి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీకి 1917లో నిజాం 1,628 ఎకరాల భూమి కేటాయించారని పేర్కొన్నారు. కొంత మంది దుర్మార్గపు ఆలోచనలతో నకిలీ పత్రాలు సృష్టించి విశ్వవిద్యాలయ భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నిజాం యూనివర్సిటీకి కేటాయించిన 1628 ఎకరాల భూమిని సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్‌ఏ స్వరేలు చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్స్ కార్యాలయంలో, జనరల్ ఛాన్సలర్ కార్యాలయాల్లో విశ్వవిద్యాలయ భూముల వివరాలన్నీ అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ భూములను రక్షించడానికి ఒక కచ్చితమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని గవర్నర్‌ని కోరినట్టు వారు తెలిపారు.

Advertisement

Next Story