పేదోళ్ల నోళ్లు కొడితే ఊరుకోం

by Shyam |   ( Updated:2021-04-09 09:17:13.0  )
CPI leader Chada Venkat Reddy
X

దిశ, మహేశ్వరం: ప్రభుత్వం పేదళ్ల నోళ్లు కొడితే సహించబోమనీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం మండల పరిధిలోని గంగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 85కు చెందిన పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి రైతుల పేరు మీద పట్ట పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌లో ఎక్కించకపోవడం సిగ్గుచేటన్నారు. నేడు భూములన్నీ రియల్ ఎస్టేట్ చేతిలో బందీ అవుతున్నాయన్నారు. 1961 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గంగారం గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్గాలకు చెందిన రైతులకు లావణ్య పట్టా భూములను 349 ఎకరాలను ప్రభుత్వం అందజేసిందని గుర్తుచేశారు. నాటి నుండి నేటి వరకు రైతులు ఆ పొలాలను సాగుచేసుకుంటూ జీవనం గడుపుతున్నా.. వారి పేరు మీద లావణ్య పట్ట పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌లో ఎక్కించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే రైతుల పేరు మీద రిజిస్టర్ చేయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీపీఐ పార్టీ అధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతమన్నారు.

Advertisement

Next Story

Most Viewed