- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదొక బూతు ప్రపంచం.. బిగ్ బాస్ షో పై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: బోర్ డమ్ ను తొలగించి ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చిన బిగ్ బాస్ షో పై సీపీఐ నారాయణ ప్రతి సీజన్లో చేసిన విధంగానే ఇప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షో మొదలై వారం రోజులు అయ్యిందో లేదో ఆ షోను, ప్రసారం చేస్తున్న ఛానెల్ ను కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో “బిగ్ బాస్ షో వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా.. సమాజానికి ఇలాంటి షోల వలన ఏం ఉపయోగం అంటూ విమర్శిస్తూ.. ప్రభుత్వాలు ఇలాంటి షోలకు ఎందుకు అనుమతిస్తున్నాయని, బిగ్ బాస్ షో ఒక బూతుల ప్రపంచమని, దాన్ని వ్యాపార నిమిత్తం వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. షోలో ఉన్న వారి తిట్లు, కొట్లాటలు చాలా అనైతికంగా అనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ షో పై కోర్టులో వ్యాజ్యం వేసినా పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ తనకు సహకరించలేదని” తెలిపారు.
గతంలో కూడా నారాయణ బిగ్ బాస్ షోను ఆపాలంటూ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ సీజన్-4 లో హోస్ట్ నాగార్జునపై కూడా మండి పడ్డారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను మంటగలుపుతున్నారని బిగ్ బాస్ నిర్వాహకులు, నాగార్జునపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.