సైబరాబాద్‌లో 11మంది ఎస్ఐలు బదిలీ

by Shyam |

దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో మైలార్ దేవ్ పల్లి పోలీస్‌ స్టేషన్‌కు అటాచ్‌గా ఉంటున్న జె.నారాయణ సింగ్‌ అదే పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కొనసాగనున్నారు. మియాపూర్ ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్న రాంబాబును పేట్ బషీర్‌బాద్‌కు, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న కె.గౌతమ్ ను జీడిమెట్ల పీఎస్‌కు బదిలీ చేశారు. మియాపూర్ పీఎస్‌కు అటాచ్‌గా ఉంటున్న సీహెచ్ రఘురాములును మేడ్చల్ పీఎస్‌కు, రాజేంద్ర నగర్ పీఎస్‌కు అటాచ్‌గా ఉంటున్న మహ్మద్ సలీంకు అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. పేట్ బషీర్‌బాద్‌లో పనిచేస్తున్న మాలావత్ పరుశురాంను అల్వాల్ పీఎస్‌కు, పేట్ బషీర్‌బాద్ పీఎస్ నుంచి మరో ఎస్ఐ గుండెపంగు శ్రీనివాస్‌ను మొయినాబాద్ పీఎస్‌కు, మేడ్చల్ పీఎస్‌లో పనిచేస్తున్న కొల్లు నాయుడు‌ను గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్‌కు బదిలీ అయ్యారు. ఆర్సీ పురంలో పనిచేస్తున్న ఎన్ భాస్కర్‌ను మాధాపూర్‌కు, జీడిమెట్ల‌లో పనిచేస్తున్న ఎన్.విశ్వనాథ్‌ను శామీర్ పేట పీఎస్‌కు, రాయదుర్గం పీఎస్‌లో చేస్తున్న మురళీధర్‌ను సైబర్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Advertisement

Next Story