అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొవిడ్ రిలీఫ్ మెటీరియల్

by Shyam |
అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొవిడ్ రిలీఫ్ మెటీరియల్
X

దిశ రాజేంద్రనగర్ : జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని డల్లాస్ నుండి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ రూపంలో కొవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను అందుకుంది. సుమారు 2,352 కిలోల బరువున్న మొత్తం 8 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. కొవిడ్ ప్రారంభం నుండి, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటి కొవిడ్ రిలీఫ్ మెటీరియల్ జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ద్వారా రవాణా చేయబడుతున్నాయి.

Advertisement

Next Story