- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పాకిస్థాన్‌కు ఇచ్చి మహారాష్ట్రకు ఇవ్వరా..?’
దిశ, వెబ్‌డెస్క్ : వ్యాక్సిన్ కొరతపై కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్రల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. సరిపడా టీకాలు లేకపోవడంతో మహారాష్ట్రలో పలు చోట్ల కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను కూడా మూసేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కొవిడ్ వ్యాక్సిన్‌ను పంపిస్తున్న కేంద్రలోని మోడీ ప్రభుత్వం.. మహారాష్ట్రకు మాత్రం ఎందుకు సరిపడా డోసులను పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. వ్యాక్సిన్ రాజకీయాలకు పాల్పడుతున్నది కేంద్రమేనని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర సర్కారును టార్గెట్ గా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతున్నదని పటోలె ఆరోపించారు. ఇదే విషయమై శివసేన అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తానొక మంత్రిననే విషయం మరిచిపోయి పార్టీ వ్యక్తి వలే ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర సర్కారుపై హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవని ఆమె తెలిపారు.